Back to Keerthanas List
అడుగరే యీమాట అతని మీరందరును
అడుగరే యీమాట అతని మీరందరును
యెడయని చోటను ఇగిరించు ప్రియము
పొరపొచ్చమగుచోట పొసగవు మాటలు
గరిమ నొరసితేను కలగు మతి
సరవులు లేనిచోట చలము వెగ్గలమవును
నొరసి పెనగేచోట నుమ్మగిలు వలపు
వొలసీ నొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేచోట పంతమురాదు
అలుక చూపేచోట అమరదు వినయము
చలివాసి వుండేచోట చెండిపడు పనులు
ననుపు లేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట నంటదు రతి
యెనసినాడు వేంకటేశుడు నన్నింతలోనె
తనివిలేనిచోట దైవారు కోర్కులు