Back to Keerthanas List
అజ్ఞానులకివి యరుహము లింతే
అజ్ఞానులకివి యరుహము లింతే
సుజ్ఞానులకివి చొరనేలయ్యా !
దైవము నమ్మిన దాసులకు
కావింపగ మరి కర్మము లేదు
దావతి జలనిధి దాటిన వారికి
వోవల మరియును వోడేఅయ్య !
గురుకృప కలిగిన గుణనిధికి
అరయబాప పుణ్యము మరిలేదు
విరసపు చీకటి వెడలిన వారికి
పరగ మరియు దీపం బేలయ్య !
జగములెరుగు వైష్ణవులకును
తగిలేటి యపరాధంబులు లేవు
అగపడి శ్రీ వేంకటాధిపు గొలిచితే
ఎగువ దిగువ మా కెదురేదయ్య!