Back to Keerthanas List
అంగనలీరే హారతులు
అంగనలీరే హారతులు
అంగజగురునకు నారతులు
శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే
ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి
ఆదిత్య తేజున కారతులు
సురలకు నమృతము సొరది నొసంగిన
హరి కిదివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన
అరిభయంకరున కారతులు
నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి
అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ
యచ్చుగ నిలిచిరి యారతులు