Back to Keerthanas List
అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతనికంటే మరి అధికులు లేరయ్యా
కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభి-
అమర వంద్యుడు మాహరికే కాక
అందరునుండెడి భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన భాగీరథి శ్రీపాదాల గలదా
మంధరధరుడైన మాధవునికి గాక
నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగా నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణమెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికేగాక